STORYMIRROR

Dinakar Reddy

Drama Fantasy Thriller

4  

Dinakar Reddy

Drama Fantasy Thriller

కొంగ వెతికెను నీటికై..

కొంగ వెతికెను నీటికై..

1 min
335

మైళ్ళు నడిచిన తరువాత

ఇక ఓపిక నశించి

కాళ్ళు లాగుతుంటే ఆగిపోయింది

ఎక్కడో దూరంగా గాలి చప్పుడు


గాలొక్కటే కాదు

నీరు కదులుతున్న చప్పుడు

ఏదో రాయి నీటిలోకి వెళుతున్నట్లు

తీరాన్ని తాకే నీటి అలజడి తరంగాలు


కొంగ లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుని

ముందుకు వెళ్ళింది

ఆహా!

అదిగో నీళ్ళు

ఇది అదృష్టమే అనుకుంది


కొంగ కాళ్ళు తగలగానే

నీరు వెనక్కి వెళ్లినట్లు జరిగింది

ఇంకో అడుగు వేసింది

మళ్లీ అంతే

నీళ్లు వెనక్కి వెళ్ళిపోయి

ఓ చిన్న గుంట మిగిలింది


కొంగ కిందికి చూసేసరికి

ఆఖరి నీటి చుక్క కూడా

అదృశ్యమైంది

మృగతృష్ణ కోసం

పడిన శ్రమకు

కొంగ కన్నీరు కార్చింది


ఆ కన్నీరు భూమిని తాకగానే


సరస్సులో నీళ్ళు మళ్లీ నిండాయి


Rate this content
Log in

Similar telugu poem from Drama