STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Romance

4  

Dinakar Reddy

Abstract Drama Romance

కన్నీటి తెరలకిక వీడ్కోలు

కన్నీటి తెరలకిక వీడ్కోలు

1 min
222

వ్రాస్తూ వేళ్ళు నొప్పి పుడుతున్నా

ఈ లేఖను ఆపబుద్ధి కాలేదు

విరహానికి కొత్త అర్థం వెతకడానికి

ధైర్యం చాల్లేదు


అలుపు లేకుండా బాధపడినా

వయసులోనే మనసుకు వృద్ధాప్యం బహూకరించినా

ఏం లాభం

ఈ రోజును ఆపలేనుగా

అంతటి శక్తి నాకు లేదు

ప్రేమకు ఉందా

మరి నాది ప్రేమ కాదా


రైలు బయల్దేరబోతోంది

నువ్వో వైపు 

నేనింకో వైపు

ఇద్దరం ఒకే చోట ఉన్నాం

కానీ కాలం కలపదు


సమాంతర రేఖల పందెంలో

అనంతపు బిందువు దగ్గరకు వెళుతున్నాం

నాకోసం నువ్వు ఆగవు

నీకోసం నేను ఆగినా ప్రయోజనం లేదు


అందుకే ఈ లేఖ

కన్నీటి తెరలకిక వీడ్కోలు పలుకుతూ

స్టేషను పచ్చ జెండా ఊపింది..


Rate this content
Log in

Similar telugu poem from Abstract