కలగన్నాను
కలగన్నాను


ప౹౹
కలగన్నానే ఎన్నడో తలపులో ఆ హాయిని
కలగనీ మనసుకూ అనుభూతి ప్రతీరేయిని |2|
చ||
పండువెన్నెల నిండు వెలుగై నిలువరించగ
పండుగల్లే ఆ వలపూ వరదై పలువరించగ |2|
కాలమా ఆగిపోవా మరలా మరచి అదును
జాలమే చేసి జాబిలికి తొలగించు బాధను |ప||
చ||
సంచరించిన ప్రతి యామినిలో సంచలనం
సంభవించినే ఊహతోఎదలోన ఆ చలనం |2|
సంకోచమేల సమీపించే తరుణమూ తరిమే
సంకల్పము సాధించ సాగిన ఆప నీ తరమే |ప|
చ||
ఆకాశాన ఆ తారలే తీర్పునిచ్చే వివరముగ
అవకాశం అందించే అను కోకుండ వరముగ |2|
మౌనమేలా మనసుల కలుపను ఆ జాగేలా
మౌలికమైన ఆ భావమే తెలపగా మరుగేలా
|ప|
చ౹౹
కోరిక కొండెక్కనీక కలపరాదా ఆ సరి బంధం
తీరికచేసి పెనవేసి పెరగనీ మరి అనుబంధం ౹2౹
బంధాలే కదా బ్రతుకునూ నడిపే ఇంధనాలు
సంబంధాలే పండించిన ప్రేమకూ వందనాలు ౹ప౹