కలగా మారదులే
కలగా మారదులే


కళ్ళను తాకే వేకువలో
కదలదులే ఇక ఏ నిమిషం
విరిసే పూవుల తావి నిజం
ప్రేమను తెలిపే స్పర్శ నిజం
ఆశగా నిలిచే సాక్షి నిజం
అడవి పూలలో అలజడులు
నా గుండెలో సవ్వడులు
అన్నీ నిజమే
కలగా మారదులే జీవితం
ఒంటరిగానే పోరాటం చేస్తూ
ముందుకు సాగే నేను
నీ రాకతో
మళ్లీ ఆశపడ్డాను
స్నేహం తోడు ఉంటుంది
నిజమే కానీ
ఎప్పటికీ కాదు కదా
మళ్లీ మళ్లీ అదే భ్రమలో
నేనెందుకు పడుతున్నా
ఇంత చిన్న జీవితంలో
కొత్తగా నీకోసం
నేనెందుకు ఏడ్వాలి
వద్దుపో
నాకీ పంచాయితీ
లొద్దు
నిజాల గొడవొద్దు..