కదులుతున్న కాగితాలు
కదులుతున్న కాగితాలు
కదులుతున్న కాగితాలు
కాగితాలు కావు అవి కవితల దొంతరలు
కవితలు కావు అవి కల్లలయిన కలలు
కలలు కావు అవి కరిగిపోయిన కన్నీళ్లు
కన్నీళ్లు కావు అవి విరిగిపడ్డ మనసు ముక్కలు
మనసు ముక్కలన్నీ కవితలుగా దాగలేక
కాగితాలలో కదులుతున్నాయి
అవే కదులుతున్న కాగితాలు..
