STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

4  

Jayanth Kumar Kaweeshwar

Action Classics Inspirational

kavithaa tatvam : kaweeshwar

kavithaa tatvam : kaweeshwar

1 min
537

అంశం : ప్రేమతత్వం

శీర్షిక : కవితా తత్త్వం 

రూపం : వచన కవితా సౌరభం 

భావాకాశం నుండి వర్షించిన ఆలోచనల వర్షం 

ఆలోచనలే అక్షరాల వయ్యారాల కుసుమ రజం 

పరిపూర్ణ పద అల్లికల రచనావేదిక పై కల సకలం 

కవితా రూపాల శిల్పకళా సౌందర్యాల జిలుగు మంజీరం 


అష్ఠ దిగ్గజముల కావ్య గ్రంధమాలికల రచనావిన్యాసం 

సమస్యా పూరణాల చర్చాఅంకురసకలప్రజ్ఞా వైభవం  

సుందర పదకవితా కీర్తనల కృతి శ్రుత మంజీరనాదం 

శతక రూపాలపద్య వైభవాల భావ రచనావవైదుష్యకౌశలం 


నారికేళ,ఆమ్రఫలారీతి రసాస్వాదన కవిపుంగవులకావ్యపఠనం 

పరికించి చదివిన , వినిన శ్రోతల , ప్రేక్షకుల తన్మయలీనం 

నూతన రచయిత, కవుల నవకవితా ప్రక్రియల నిర్మిత కవితా శిల్పం

విశ్వా వ్యాప్తి కి మార్గదర్శనం చూపు ప్రచురణ కర్తల సహకారం

సదా కవితా రసామృత వర్షమున తడవని జీవితం వ్యర్థమేమో ఈ జనావళికిన్. 

కవీశ్వర్. 



Rate this content
Log in

Similar telugu poem from Action