కాంక్ష
కాంక్ష
తలుపు తెరు
నే వచ్చా
తలుపు తీయగానే
ముద్దు పెట్టేస్తా
వర్షించేందుకే వచ్చా
చాలా కాలంగా మేఘాక్రుతిలో
ముసురుకొని
వేదనా గ్రస్తతతో
సమస్తం భరించి
అనంత శిరోభారంతో
వాకిట ముందు నిల్చున్నా
చాలా ఊళ్ళు తిరిగొచ్చా
దేశాలు చుట్టొచ్చా
గుండెలు తాకొచ్చా
గొంతులు వినివచ్చా
సుకుమారీ
విజ్రుంభిణీ
ప్రియశక్తీ ప్రియమణీ
నీలాంటి సుశోభిత సుసజ్జిత మ్రుదు మనోహర
మహిమాన్విత
లలిత
లలిత
ప్రేమాంకురిత హ్రుదయం
ఎక్కడా లేదని
రౌరవాది నరకాలు దాటి
ముల్లోకాలు వదలి
పరుగు పరుగున నీ ముందు కొచ్చి
వాలా
రక రకాల మనుషులు
రంగులు మొహాలకు రమణీయతలు
మోహాలకు
చిత్ర విచిత్ర లిప్ స్టికులు పెదాలకు
తళుకు బెళుకు భంగిమలు వయ్యారాలకు
ఆదర్శ భీభత్స కరుణారస కల్లోలతలతో
మోసగించే
జవరాళ్ళు
శవభారంతో రుద్రుడిలా తిరిగొచ్చా
చుట్టూ కాంకాళాలు
చేతుల్లో మంటలు
బాహువుల్లో తీరని కాంక్ష
తలుపు తెరునే వచ్చా
తలుపు తీయగానే ముద్దు పెట్టేస్తా...
... సిరి ✍️❤️
