కామం తో....
కామం తో....


మొన్న కంఠానికి గొలుసుకట్టి
కర్కశంగా కలబడ్డారు
నిన్న బస్సులోనే బలత్కారం చేసేసి
బయటకు తోసేసారు
నేడు పైశాచికంగా మీద పడ
ఎముకలు విరిచేశారు
ఎక్కడిది ఈ కర్కశత్వం?
ఎందుకింత పైశాచికత్వం?
పిచ్చ కుక్కల మదపిచ్చి కుక్కల్లా
మతి చెడి మత్తెక్కి
మగువ ప్రాణాలను
హరించి హర్షించి
అబల కనబడితే చాలు
ఆరగించే కళ్ళతో
అత్యాస పడి కామం తో రగిల పోయి
కర్కశంగా అనుభవించి
మా అంగాంగాలని గాయపరిచి
గొంతు కోసి గోతులో వేసి గంతులేసే
మీకు ...ఏ పేరు పెట్టాలో భాషకు అందటం లేదు
ఓ మానవ మగ మృగాల్లా రా..
ఎటు పోతున్నారు
తల్లిదండ్రులారా మీరు ఏమి చేస్తున్నారు.
మీ బిడ్డ అ మందుకు బానిసై
బూతి చిత్రాల్లో తేలి.....
బూతు పట్టిన భూతమవుతుంటే
ఏమి చేస్తున్నారు
మీరు కూడా పోరా బాబు అని మా మీదకు వదిలేస్తున్నారా....
ఓరన్న ....మా పై
కనీసం జాలి అయినా చూపించండి
కర్కశంగా మా మీద పడినప్పుడు
మా ఆక్రందన వినపడదా
ఆ నరకయాతన నీ కంటికి కనబడదా
ఎందుకంత క్రూరత్వం పైశాచికత్వం??
ఒక్కడే ఆనందిస్తే ఎవడి పిచ్చి వానికి ఆనందం
మరొకరిని ప్రేమించి ఆనందిస్తే అది పైశాచికానందం
పిచ్చి వాళ్ళు అయితే పరవాలేదు
కాని పిశాచాలు గా
మద పిశాచాలు గా ఉండకండి
.... రాజ్....