STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

కాలమా! ఎటు నీ పయనం?

కాలమా! ఎటు నీ పయనం?

1 min
346

ఏమో ?ఎటు పోతోందీ కాలం?

మనిషిని చూసి మనిషే భయపడడం

పలకరించాలంటే భయపడడం

ఆత్మీయతతో హత్తుకోవాలంటే భయపడడం

ఆప్యాయంగా ఆలింగనం చేద్దామంటే భయపడడం

వినడానికి వింతనిపించినా

వణుకు పుట్టే వాస్తవమే మరి

స్వార్థంతో విర్రవీగుతూ

అహంభావంతో హుంకరిస్తూ

కామపిశాచిగా సంచరిస్తూ

విషపురుగులను సైతం నమిలేస్తూ

భూమిని సైతం చీల్చేస్తూ

వృక్ష జాతిని నరికేస్తూ

మూగజీవులను హతమారుస్తూ

నదీజలాలను కలుషితం చేస్తూ

వికృత చేష్టలతో వింత మృగమై

విశ్వాన్ని సైతం గుప్పిట్లో బంధీని చేస్తూ

విర్రవీగే మనిషి గర్వానికి పతనం

ఆరంభమమయ్యిందేమో...?

ప్రకృతి కోపాగ్నికి సంకేతాలుగా

సునామీలు స్టైరిన్ లు వైరస్ లు

మనుగడకు ప్రశ్నార్థకాలుగా నిలిచాయి

ఇకనైనా మేలుకోకపోతే

మానవాళిపై కన్నెర్ర చేసిన 

ప్రకృతి కోపాగ్నిలో జ్వలనం

కాక తప్పదేమో?

ఖబడ్దార్ అంటూ సవాలు

విసురుతున్న కాలం

ఏమో..ఎటువైపు వెళుతుందో..


Rate this content
Log in

Similar telugu poem from Abstract