STORYMIRROR

Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

కాలచక్రం

కాలచక్రం

1 min
338

కాలచక్రమును వెనక్కి తిప్పగలిగితే, వెళ్ళిపోతాను

తిరిగి మొదలు పెట్టడానికి నా ఈ జీవితమును

పొందుతాను అమ్మ ప్రేమను, నాన్న ఆప్యాయతను

అనుభవిస్తాను తనివితీరా సోదరీ సోదరుల ప్రేమను

ఆనందిస్తాను తోటివారితో చేసి చిలిపి అల్లరులను

ఆస్వాదిస్తాను పెద్దల ఆప్యాయతానురాగాలను

తెలుసుకుంటాను పెద్దలనుండి అన్ని విషయములను

శ్రద్ధగా నేర్చుకుంటాను గురువులు చెప్పే పాఠాలను

అర్థంచేసుకుంటాను పెద్దవారు చెప్పే సుద్దులను

పునరుద్ధరించుకుంటాను నా స్నేహబంధాలను

నిలుపుకుంటాను బంధువులను, బాంధవ్యాలను

నేర్చుకుంటాను చేసిన తప్పులనుండి పాఠాలను

సరిదిద్దుకుంటాను నా వలన జరిగిన తప్పులను

అందిపుచ్చుకుంటాను చేజారిన అవకాశాలను

ఆలోచించి సరిగా తీసుకుంటాను నిర్ణయాలను

సంయమనం పాటిస్తాను త్వరపడి మాటజారను

ఇస్తాను భాగస్వామికీయవలసిన గౌరవమును

చూపుతాను పిల్లలకు సరియైన మార్గదర్శకాలను

జీవితకాలం పిల్లల అభ్యున్నతికి పాటుపడతాను

పశ్చాత్తాపానికి నా చివరిదశలో అవకాశమివ్వను.


Rate this content
Log in

Similar telugu poem from Inspirational