కాలాలు సరికొత్త అనుభవాల కలయిక
కాలాలు సరికొత్త అనుభవాల కలయిక
మారుతున్న కాలాలు,
పంచే నూతన అనుభవాలు,
నేర్పించును ఎన్నో పాఠాలు,
తెచ్చును ఎన్నెన్నో మార్పులు,
అనుక్షణం చూపును కొత్త మార్గాలు,
పెంచును కష్టాన్ని ఎదుర్కొనే సామర్ధ్యాలు,
మార్పు కాదా ఎదుగుదలకు కారణం,
అది అర్థం చేసుకోలేని వేళ మన పయనం శూన్యం
ప్రతికూలతలను తట్టుకోలేని హృదయం
నూతనత్వానికి పలుకునా ఆహ్వానం
మనసులో లేని వేళ సమన్వయం
విజయాన్ని చేరుకోవడం కష్టతరం
కాలాను గుణమైన వ్యవహారం
ఉత్తమ శిఖరాలకు చూపును మార్గం.
