జననం
జననం
ఇది ఒక అద్వితీయ అపురూప అరుదైన వరం
ఒక బిడ్డ జననం ఒక తల్లికి పరవశం..
ఒక తండ్రికి గర్వ కారణం
అమ్మా నాన్నా అనే పిలుపుకి అర్హత ఈ జననం
తండ్రి తొలి స్పర్శతో పులకరిస్తుంది
తల్లి ప్రేమతో ధన్యమవుతుంది
గురువు ఆశీస్సులతో మంచి విధ్యార్ధి అవుతాడు
ఒక స్నేహితునికి మంచి హితుడవుతాడు
యుక్త వయస్సులో ఒక బంధానికి ముడిపడతాడు
భార్య ,భర్త , బిడ్డ ఇలా స్థానాల్ని ఆక్రమించుకుంటాడు
బంధాలలో అనురాగముతో బంధింప బడతాడు
తనకి ఇంత మంచి మానవ జన్మను ఇచ్చిన
కన్నతల్లికి ,పుడమి తల్లికి తన వంతు కృషిని అందించి
తన జన్మ సార్దకత చేసుకుంటాడు .