జీవన్మరణం
జీవన్మరణం
ఏం కాలం
దాపురించిందో
కలికాలపు కరోనా
ప్రతి జీవికి
జీవన్మరణ పరీక్ష పెట్టింది
ఏ మేధస్సు కు అందని
ఏ గురువు నేర్వని
ఏ సిలబస్ లో లేని
యక్ష ప్రశ్నలా
మేధావి వర్గాన్ని
తొలిచేస్తోంది
జవాబు తోచక
విరుగుడు కానక
అంపశయ్య పై
సాగుతుంది నేటి మనుగడ
అవని నుండి అంతరిక్షం దాకా
సాగిన మనిషి ప్రతిభ
విశాల విశ్వం ముందు
వెలవెలబోతోంది
ప్రపంచాన్ని తొలిచేస్తున్న
కరోనా పురుగుకు
ఏ పెస్టిసైడ్ పనిచేస్తుందో
కనిపెట్టాలి
బూజు పట్టిన బుద్ధి ని
శుద్ధి చేసి
మానవత్వానికి మెరుగులు దిద్ది
మనిషితనానికి పరిమళాలు అద్దాలి
