జాడలేని ప్రేయసి
జాడలేని ప్రేయసి
1 min
228
ప౹౹
జాడలేని ప్రేయసి జాగులేక కనిపించవా
జాలిలేని ఊర్వశి జాగరణ తొలిగించవా ౹2౹
చ౹౹
మనసంతా రణమైనే నీ రాకకోసం వేచి
వయసంతా తోరణమైనే అల్లుకో చూసి ౹2౹
కారణమేదైనా కలహమేనే ఆ ఎదలోన
తరుణం ముంచే తనువునే తపనలోన ౹ప౹
చ౹౹
ఊహలోన ఊరించి ఉట్టి మాటలేలనో
గుహ్యమైన మదిలో సుడి ఆటలేలనో ౹2౹
చూపులతోటి ఆ చుక్కానిలాగ పట్ఠేసి
వలపులతోటి వయారాలివ్వవే ఒట్టేసి ౹ప౹
చ౹౹
జాబిలికెందుకో జాగ్రదావస్త పరికించా
జమిలితోనే అది సాధ్యం మురిపించా ౹2౹
మునుముందు కాలాహరణం చేయకే
ప్రేమవిందు ఫలాహారంగా పంచేందుకే ౹ప౹