ఇంట్లో అందమైన క్షణాలు
ఇంట్లో అందమైన క్షణాలు


ఎంతో పెద్దది ఈ లోకం,
ఇల్లు అందులో ఒక అందమైన చిన్న లోకం |౧|
తల్లి తండ్రులు ఇచ్చెను అమూల్యమైన జీవితం,
తోబుట్టువులతో కొత్త రంగు అందుకొనెను జీవితం |౨|
తాతా నానమ్మ కథలు ఇచ్చెను ఎంతో ఆనందం,
అమ్మమ్మ తాతా చేశేను అమితమైన గారాభం |త్రీ|
అమ్మ ఎప్పుడూ వడ్డించెను ప్రేమపూరితమైన భోజనం,
మనసులో ఆమెకో ఎప్పుడూ ఇవ్వాలి నీరాజనం |౪|
నాన్న నేర్పించెను ఎన్నో కొత్త విషయాలు,
ప్రతి మాటలో ఉండెను అమూల్య ఆశయాలు |౫|
ఇంట్లో తల్లితండ్రులు పిల్లలు పంచుకొనెను ఎన్నో ముచ్చట్లు,
అవి వింటూ నవ్వ
ుకుంటూ చిన్న పిల్లలు చకచకా కొట్టెను చప్పట్లు |౬|
ప్రతి రోజు ఇచ్చెను ఒక నూతన ఆనందం,
గడిచిన అనంతరం అయిపొయెను అతీతం |౭|
అప్పుడప్పుడు జరిగెను చర్చలు,
అప్పుడప్పుడు జరిగెను ప్రశ్నలు జవాబులు |౮|
కథలు వినటం ఎప్పుడూ ఒక అనుభవింపదగిన కాలక్షేపం,
చిన్న పిల్లలకు రామాయణం మహాభారతం ఎప్పుడూ ఆసక్తిదాయకం |౯|
వేమన పద్యాలు వింటూ తెలిసెను నీతి సూక్తులు,
అవి తెలిసి ఆచరించెనుచొ ఎవరైనా అవగలరు విశిష్ట వక్తలు |౧౦|
ఇంట్లో అందమైన క్షణాలు చిరస్మరణీయం,
రక్తసంబంధాల బలం అవిస్మరణీయం రమణీయం |౧౧|