ఇంటికెళ్ళాలి
ఇంటికెళ్ళాలి
కళ్ళు అలసిపోకుండా
ఎన్ని కలలు కనాలి
కాని మాటలు వింటూ
కబుర్లు చెప్పుకుంటూ
కాదనే వారి మాటలు వింటూ
ఇంకెంత కాలం
నీళ్ళు కూడా దొరకని స్థలంలో
నివురుగప్పిన నిప్పులా ఇలా
దహించుకుపోతూ నిలబడాలి
కాదనే వాళ్ళ దగ్గరే
కరువు తీరా ఏడ్చి
తలుపులు తీయమని
గుండెలు బాదుకుంటూ
శాపనార్థాలు వింటూ
అసమర్థతను నిరూపించుకోవాలి
మీద పడే వాన
కొత్త నవ్వులు ఇచ్చినా
వాడని పూలను తేలేని వాడిని
అందరికీ నచ్చని వాడని
ఈ ఆందోళనల నుంచి
దూరంగా ఉంటే
మళ్లీ నాకు అమ్మ ఒడి దొరికితే
వెళ్ళాలి
ఇంటికెళ్ళాలి..
