STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"ఈ క్షణం..!"

"ఈ క్షణం..!"

1 min
379

ఈ క్షణం..!

నీ పాద జాడలను నాకు మధుర జ్ఞాపకాలుగా మిగిల్చి,

నువ్వు వేరొకరితో ఏడడుగులు నడవడానికి సిద్ధపడిన క్షణం !

నీ మాటల మువ్వలను నాకు తీపి గుర్తులుగా మలచి,

నువ్వు ఎవరితోనో మూడుముళ్లు బంధంతో ఒక్కటవ్వడానికి సన్నద్ధమైన క్షణం!

ఈ క్షణం..!

నీ ఊహలు కనడానికి కూడా నేను అర్హత కోల్పోయిన క్షణం..!

నీ మాటలు వినడానికి కూడా నా ఆశలను భారంగా వదిలేసిన క్షణం..!

ఇప్పటివరకూ నీ ఆలోచనలతో నిండిన నా మదిని చీల్చుతూ నువ్వు వేరొకరి సొంతమయ్యే క్షణం..!

ఎక్కడివరకైనా నీ ఆశలను మోసుకుంటూ వెళ్ళాలనే నా యదని కాల్చుతూ నువ్వు విడిపోయి దూరమయ్యే క్షణం..!

ఈ క్షణం..!

నా కలలు అలలు కన్నీటి కెరటాలై ఎగసిపడుతుంటే,

నీ పాదాలను అవి ఇక ఎప్పటికీ తాకలేని క్షణం ?

నా కేకల అరుపులు నిప్పు రవ్వలై ఎగిరిపడుతుంటే,

నీ మదిని అవి ఇక ఎన్నటికీ చేరలేని క్షణం ?

ఈ క్షణం..!

గుండీల మాటు దాగున్న నా ఈ చిట్టి గుండె,

నువ్వు వదిలేసి వెళ్లి ఏళ్లు గడుస్తున్నా...!

ఇంకా నీ ధ్యాసలోనే,

నీ రాకకై వెర్రిదానిలా పరితపిస్తూ ఎదురుచూసింది పాపం..!!

కానీ, ఇక నువ్వు రావనే నిజాన్ని భరించలేక,

ఆపై నీ జ్ఞాపకాలు మోయలేక బాధతో బరువెక్కిపోతూ...

నిన్ను ప్రేమించిన గాఢతలో ఘాటుకి కరిగిపోతుంది,

దానికదో శాపం...!

ఈ క్షణం ...

ఇక వెళ్లిపోతుందిలే అన్నందుకు సంతోషపడాలో..?

లేక,

ఈ క్షణం...

కలిగిన ఈ దుఖం జీవితాంతం మోయాల్సి వస్తుందని బాధపడాలో ..?

అర్థం కాక,

తల్లిడిల్లిపోతుంది నాలో పెనవేసుకున్న నీకై పరితపించే

నా అంతరాత్మ...!

ఓ ఆత్మక్యమై...!!

- సత్య పవన్ ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract