STORYMIRROR

T. s.

Tragedy Others

4  

T. s.

Tragedy Others

గూడు లేని గువ్వ

గూడు లేని గువ్వ

1 min
345


గూడు లేని గువ్వ ఒంటరయ్యింది.

తన జత మాయలో పడి ఓడిపోయింది.

తను విసిరిన కనుసైగకు మది కదిలి ప్రేమ కడలి చేరింది.

అనంత సాగరాన్ని దాటి పయనించాలని పిచ్చి ప్రయత్నం చేసింది.

మూసి ఉన్న మనసు చాటున దాగి ఉన్న కలల ఆశలన్ని నిదుర మేల్కొల్పింది.

హృదయానికి రెక్కలు వచ్చాయనుకుంది.

విహరించడానికి ఆకాశం సరిపోదని హద్దులు మరిచింది.

కొత్తగా ప్రేమ ప్రపంచం కావాలని నింగికెగసి నేల కొరిగింది.

చివరికి మనసును చితిలో చేర్చింది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy