గురువు
గురువు

1 min

329
శీర్షిక: జ్ఞానజ్యోతి
దేహమంతా ఆప్యాయతా నవనీతం పూసుకుని
సుతిమెత్తని గులాబీ మనసులను
అక్కున చేర్చుకుని
మైనపు ముద్దలలాంటి వాళ్ళను
జ్ఞాన సరస్వతులుగా తీర్చిదిద్దే శిల్పి
అక్షర విత్తులను నల్లబల్ల మడిలో నాటి
సవ్యమైన ఆలోచనా జలాన్ని పోసి
జ్ఞాన పైరును పండించే నిత్య కృషీవలుడు
సహనమనే చమురుతో
బోధన వత్తిని వెలిగించి
అజ్ఞాన చీకట్లను తొలగించే
గురువు జ్ఞానజ్యోతి
ప్రగతి బాట నడిపించి
గెలుపు తీరాలకు చేర్చే రథసారథి
*✍️కాదంబరి శ్రీనివాసరావు✍️*