STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy Fantasy

4  

ARJUNAIAH NARRA

Tragedy Fantasy

గుండెను చిదిమిన అనుభవం

గుండెను చిదిమిన అనుభవం

1 min
486

వేకువజామున వెయ్యి స్వప్నాలతో

సూర్యోదయమున నీకు సుప్రభాతాలు

సంధ్యకాలమున సరిగమలు ఆలపిస్తూ

కోకిల కుహు కుహులో నీ గొంతు వింటూ

పూసిన పువ్వులో నీ మోము చూస్తూ

నా యెదసడిలో నీ ఉపిరిని కలుపుకోవాలని

నా గుండెసడిలో నీవేప్పుడు ఉండాలని


మనసున నిన్ను తలచి, కౌగిలికి నిన్ను వలచి

ఇన్ని వసంతాలు నీ ప్రేమ కోసం 

మన బతుకు బాటలో గులాబీ పువ్వులు 

పూయిస్తూ, ఆ పువ్వులను దారెంట పరిచా

నీ కాలికి ముళ్ళు తగలనియకుండా


ప్రియ! ఇంతకు నీ గుండెల్లో నా జాడే లేదు

నీ ఎదలో నా సవ్వడి లేనే లెదు

నీ అపశృతి స్వరాల సవ్వడులు విన్నాక

నా హృదయ తరంగాలలో 

చిరునవ్వుల సరఫరాలు ఆగిపోయాయి 

ఒంటరితనాన్ని ఎంతగానో ఇష్టపడ్డ నేనే 

ఇప్పుడు ఒంటరితనాన్ని బరించలేకపోతున్న

వర్ణించలేని కథలను, చెప్పుకొని వ్యధలను

నా గుండెలో జ్ఞాపకాలుగా దర్శనమిస్తున్నాయి


ఎన్నో పుస్తకాలు చదివి జీవన సత్యాలను

అర్థం చేసుకున్న, నీ మస్తిష్కం నాకు బోద పడలేదు

నా చుట్టూ ఎవ్వరు వున్నా లేకున్నా

నాదైన లోకంలో సంతోషంగా బ్రతికేస్థా......కానీ

నా ఆశలు ఎగిరిపోయాయి, నా కల కరిగిపోతుంది

కాలం తరలిపోతుంది, కాయము వట్టిపోతున్నది

నా కన్నీళ్లు నన్ను విడిపోయేలోపు 

మనసు అడుగున పేర్కొన్న 

విరహ గీతాలను విషాద గీతాలుగా అలపిస్తూ

నా గుండెలో నీవు పిడిబాకు దింపి చిదిమిన

ముప్పది గాయాలను మానుపుకుంటా ..........లేదంటే 

నేనె మరణించి విషాద గీతమై 

ఎప్పటికి ప్రేమ కావ్యాలలో జీవిస్తా

************************

సుదూరం నుండి సమీరం 

సీని గీతాన్ని లీలగా మోసుకొచ్చింది


"ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక

ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగక

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక"



Rate this content
Log in

Similar telugu poem from Tragedy