Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ARJUNAIAH NARRA

Tragedy

4.8  

ARJUNAIAH NARRA

Tragedy

గుండె కోత

గుండె కోత

1 min
587


మనసుకైనా గాయం తాలూకు చిత్రవధను మరిచిపోవాలని కవితలు రాస్తుంటే

ఆలోచనలు చిరునవ్వులను చెరిపివేస్తాయి

మనసు సంద్రం నుండి బాధలు అవిరై

చెక్కిలిపై కన్నీరు బొట్టుల అక్షరాలు

కాగితంపై ప్రవహిస్తుంటాయి


కాలం జ్ఞాపకాలను లిప్తపాటులో 

నమ్మిన వారి మోసాన్నీ నిత్యము 

జ్ఞప్తికి తెస్తూ బాధిస్తుంది 

బాదైతే బరించుదును 

కానీ చిత్రవధై ప్రతి క్షణం చంపుతున్నది.....

వ్యధతో నిద్రలేని రాత్రులను, 

ప్రశాంతత లేని మనసును,

సంతోషం లేని ఘడియలను, అనుభవిస్తున్నాను.....


ఎందుకంటే........

నేను అతనిని ప్రేమించాను

తనని చూసిన తొలి చూపులోనే

కల్మషం లేని మనసుతో....

కల్మషం ఉన్న మనసును,

కల్మషం లేని హృదయంతో.......

కల్మషం ఉన్న హృదయాన్ని,


అవును నాకు తెలియక......

నేను కల్మషం లేని మనసుతో  

కల్మషం లేని హృదయంతో 

అతనిని ప్రేమించాను....


ఇప్పుడు....

మూడు ముళ్ళతో నా గుండె 

ముప్పై ముక్కలయింది

ఏడు అడుగులతో నా హృదయం 

వెక్కి వెక్కి ఎడుస్తున్నది

ఎడువసంతాలతో నా జీవితం

ఎండిపోయి ఎడారిగా మారింది


ఎందుకంటే.......

మూడు ముళ్ళు వెయ్యకముందే

మూడు సంవత్సరాలు ఒకరిని ఉంపుడు గత్తెగ

ఊరేగింపుగా ఊరందరికి తెలిసేలా కాపురం చేసి

నాతో ఏడూ అడుగులు వేశాడు

నా ఖ్యాతిని పాతాళం తొక్కేసాడు


దాంపత్యం దాగుడు మూతల ఆటలు

దగాపడిన గుండె సవ్వడి 

మనసు అగ్నిపర్వతంలా పేలి

ప్రేమను హత్య చేసింది

ఆ శిథిలాలో నవ సంసారం చేస్తున్నాను


నాకు నేనుగా అతనిని ప్రేమించనులేను

నాకు నేనుగా తనకు అర్పించుకోలేను

నాకు నేనుగా ఓదార్చుకోలేను

మాకు మేముగా విడిపోలేము

తనకు నాకు మధ్య దూరం దూరంగానే ఉంది

ఆ అగాధం మా మనసుల్ని దగ్గరకు చేయలేదు


అయిన నేను అతనిని ప్రేమిస్తూనే ఉంటా.......

ఎందుకంటే కాయం కట్టెల్లో కాలే వరకు 

నా ఊపిరి గాలిలో కలిసే వరకు

నా బ్రతుకు ముళ్లబాటలో తోడుగా నడుస్తా అన్నాడు



Rate this content
Log in