బ్రోకెన్ ఏంజెల్
బ్రోకెన్ ఏంజెల్
నేను ఏంజెల్ నే ....
కానీ ఒక బ్రోకెన్ ఏంజెల్ నీ...
రేపు వాడి పోతానని తెలిసిన
అందరినీ నవ్వించెందుకు వికసించిన పువ్వు ని..
సముద్రపు లోతుల్లో దాగున్న ముత్యపు మువ్వ ని నా కలలలో నింపుకున్న కిన్నెరసాని నీ...
పెలపెల ద్వనులు చేస్తూ వురిమి పడే వర్షాన్ని గుండెల్లో దాచుకున్న అవని నీ..
వుబికి పడే లావా ని చిరునవ్వు లో బిగపట్టిన మందాకిని నీ....
ఎంత ఎత్తుకు వెళ్ళిన తలవంచుకొని తాలి కట్టించుకోవాలని తెలుసుకున్న అమ్మాయిని...
పిల్లలే ప్రపంచం అని బ్రతికే ఒక సాటి అమ్మ నీ...
నేను ఎవరో కూడా చెప్పుకోలేని అనామికని...