అమ్మమ్మలు -మామ్మలు
అమ్మమ్మలు -మామ్మలు


ఆమ్మమ్మలు-మామ్మలు
అమ్మా! నీకు వయసైపోతోందే! అలిసిపోయావు! విశ్రాంతి తీసుకోవే అనే కూతురు లేదు
అత్తయ్యగారు మీరు కూర్చోండి నేను చేస్తాననే కోడలు లేదు
ఎందుకంటే కూతురూ, కోడలూ తమ తమ ఉద్యోగాలతో బిజీ!
అరవయ్యొచ్చినా, ఒళ్ళు సహకరించక పోయినా
మా తరం ఆడవాళ్ళకు రిటైర్మెంట్ లేదు
కూతురు పిల్లలకో, కోడలు పిల్లలకో మనుమలు మనమరాళ్ళు అనుకుంటా అంతటి చాకిరిని మళ్ళీ చేయాల్సి రావడంతో ఊపిరి పీల్చు కోవడానికి ఖాళీ
లేని, అనడానికి వీలు లేని, మానవ హక్కులు లేని
అమ్మమ్మలు, మామ్మలు వీరు; అన్ని హక్కుల సంఘాల వారు అందరు పట్టించుకోని సమానత్వం లేని
మహిళలు వీరు; నా బొందో అనుకుంటూ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పని చేసే శ్రమజీవులు
ఇంత చేసిపెట్టే మనవారైన వీరికి
ఏమిటి మన బహుమతి?
వృద్ధాశ్రమ వసతి!!!