STORYMIRROR

Kadambari Srinivasarao

Tragedy

5.0  

Kadambari Srinivasarao

Tragedy

చైనా నజరానా.... కరోనా.....

చైనా నజరానా.... కరోనా.....

1 min
411


జీవి ఏదైనా..

వారు జిలేబీలా చప్పరించేస్తారు

ఆహారంలో అరుదైన రుచికోసం

ఆరాటపడతారు

ఫలితం ఊహించని పరిణామం

ఊహాన్ లో దర్శనం!

దగ్గితే చాలు...

దగ్గరలో జనాలు పిట్టల్లారాలిపోతున్నారు

తుమ్మితే చాలు...

తరతమ బేధాలు చూడకుండా

ఉసురు తీస్తుంది

 చైనా ప్రపంచానికిచ్చిన నజరానా కరోనా

ఖండమేదైనా కరోనా సామ్రాజ్యమే నేడు

తిండి యావతో జీవహింస

మతం మత్తులో మారణహోమం

అక్రమ సంపాదనకు అడ్డాగా

అవతారమెత్తిన దేశాలు

పాపపు పంకిలాన్ని

మంచిగంధంలా పూసుకుని

పందిలా బతుకు వెళ్లదీస్తూ

నేటి స్థితికి

బావురుమంటున్నాయి

నూరుగొడ్లను తిన్న రాబందు

ఒక్క గాలివానకు చచ్చినట్లు

గాలితోనే ప్రాణాలు 

గాలిలో కలిసిపోతున్నాయి



Rate this content
Log in

Similar telugu poem from Tragedy