ఆశయాల వలయంలో
ఆశయాల వలయంలో


ఆశయాల వలయం లో
మతం పేరుతో మౌఢ్యమును పెంచి
దేవుని పేరిట దానవత్వం పంచి
మానవతని మంటకలుపుతున్న
మతాచార్యులని చూసి
ఆవేదనతో అలమటించి పోతున్నాను
కాని
ఆది శంకరున్ని కాలేకున్నాను
కులం మతం ప్రాంతం భాష సిద్ధాంతం
ఇలా ప్రజలని విడదీసి
పౌరుల్ని ఆటవికులుగా మారుస్తున్న
స్వార్థపరులైన నాయకుల్ని చూసి
ఆవేశంతో నిలువెల్ల కంపించి పోతున్నాను
కాని
అపర చాణక్యున్ని కాలేకున్నాను
బాధలతో సతమతమౌతూ
కష్టాల కన్నీళ్ళతో కడుపునింపుకునే
తోటివారిని చూసి
హృదయం కరిగి నీళ్ళవుతోంది తప్ప
నేను బుద్ధునిగా మారలేకున్నాను
ఈ ఆశక్తతకి కారణం
నేను
నేను కావడం