గత ఏడాది !
గత ఏడాది !
గత ఏడాది తొలిసారి మ్రోగింది
నా మదిలో బాజాభజంత్రీ .
నాటినుంచి నీవు అయిపోయావు
నేను ప్రేమించిన పూబంతి .
వాసంతీ ! నీవు నా దమయంతి ,
నేను మెచ్చిన ఇంతి .
నాలోకంలోకి రంగులు తెచ్చిన కాంతీ !
ఈ ఏడు రావాలి మనలో కొత్తక్రాంతి ,
జరుపుకోవాలి సంబరంగా
అత్తవారింట మొట్టమొదటి సంక్రాంతి .
నిన్ను తలిస్తే , పగలంతా
కళ్ళముందు నేను చూస్తున్నట్లుగా
ముద్దులొలికే మరో విజయశాంతి .
రాత్రవగానే , కలలో అంతా
నన్నే వింతగా , మైమరపిస్తున్నట్లుగా
నీలో తెరమీది నాటి డిస్కోశాంతి .
చేసేద్దామా మనం కలసి కాపురం !
రాసేద్దామా ప్రేమికులంటే
నువ్వు నేనలా ఒక మధురకావ్యం !!
