STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

గణతంత్రమా!ఏదీ నీ చిరునామా?

గణతంత్రమా!ఏదీ నీ చిరునామా?

1 min
346


గణతంత్రం 

పేరు వినగానే

నరనరాల్లో దేశభక్తి భావం

అణువణువునా అంకిత భావం


ఎందరో వీరుల త్యాగంతో

విరబూసిన స్వేచ్ఛా పుష్పం

మన స్వాతంత్ర్యం

నేడు కొందరి అల్లరి మూకల

చేతిలో వసివాడుతున్నది


బానిస సంకెళ్లను తెంచి

తెల్లదొరలకెదురేగి

ప్రాణాలర్పించి సంపాదించిన

స్వేచ్ఛా వాయువులు

కొందరి చేష్టల వల్ల

విషపూరితమవుతున్నది


నిద్రాహారాలు మాని

పోరాట బాట నడిచి

ఆంగ్లేయులను దడదడలాడించి

తరిమి తరిమి కొట్టిన

దేశభక్తి భావం

నేడు కొందరి వల్ల

పెడదారి పడుతున్నది


సమరయోధుల శౌర్యం

సమరవీరుల రుధిరం

జాతీయ జెండా గౌరవం

నేడు మట్టి పాలవుతుంది

గణతంత్ర చిరునామా

వెతుక్కోవలసి వస్తుంది


ప్రతీ ఒక్కరి మనో వీధిలో

సమతాభావం

పెల్లుబికినపుడే

నిజమైన గణతంత్రం 

సాధించినట్టు



Rate this content
Log in

Similar telugu poem from Inspirational