STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

గడ్డి పూలు

గడ్డి పూలు

1 min
389

ఎన్నెన్నో అందాలు

ప్రకృతి ప్రసాదించిన వరాలు


సుప్రభాత గీతాలాపనతో 

కిలకిల మంటూ నింగిన వియతుల సైన్యం


అరుణిమ కాంతులతో చీకటి తెరలను

తొలగించగ భానుడు సంధించిన కిరణశరాలు


విరులపై తళుకులీను తుషార బిందువులు

మేలిముత్యాలను తలపిస్తున్న వైనం


చిన్నగా లేచిన పిల్ల కాలువల నీటి పరవళ్లు

లయబద్దమైన సంగీత స్వరాలు పలుకుతున్న దృశ్యం


 మెల్లగా చల్లగా వీస్తూ గడ్డిపూలతో దోబూచులాడుతూ సాగుతున్న మలయ సమీరం


మత్స్య కారుల హైలెస్సా గీతాలకు మైమరుస్తూ

సంతోష జల్లులను కురిపించిన గోదారమ్మ తల్లి


గిట్టల సవ్వడితో గజ్జెలు చప్పుళ్ళతో

గోధూళి వేళ తిరుగు పయనమయిన ఆలమందల అందాలు


సంధ్యా సమయ సూచికగా కొండల నడుమ

పొద్దు వాలుతున్న ప్రభాత సూరీడు


 ఎన్నో.. ఎన్నెన్నో..సహజ అందాలతో

అలరాడు ప్రకృతి 

నేడు సాంకేతికత ముసుగులో వసివాడుతున్నాయి


ప్రకృతి ని ప్రేమిద్దాం పరిరక్షించుకుందాం

భావితరాలకు తరగని ఆస్తిగా అందిద్దాం



Rate this content
Log in

Similar telugu poem from Fantasy