కలల రాశి-ఫాంటసీ
కలల రాశి-ఫాంటసీ
ఊహలకు రెక్కలు తొడిగి
ఊసులకు ప్రాణం పోసి
ఆలోచనకు పదునే పెట్టి
సృష్టించే అపురూపం
అద్భుతాలకు ఆలవాలం
కల్పితమే అయినా
కలలకు రూపమే అయినా
పంచేను ఆనందాల రాశి
అదే కదా ఫాంటసీ
***%%%***
ఫణికిరణ్
