STORYMIRROR

# Suryakiran #

Thriller

4  

# Suryakiran #

Thriller

ఎవరో రాస్తున్నారు !

ఎవరో రాస్తున్నారు !

1 min
354

ఎవరో వ్రాస్తున్నారు ఆమెకు లేఖ .

ప్రియమైన రాధకు అని ఉంది సంబోధన .

ప్రతి వాక్యంలో

ఆరాధనను చూపే భావన .

' ఆకాశరామన్న '

అని చిరునామా చూడగ .

మరి , ఎవరు వ్రాస్తున్నారో తెలిసేదెలా ?

ఆ సంగతిని

గ్రహించడంలోనే కదా దాగి రహస్యమంతా !


స్పందన కోసం

చూస్తున్నాడంటే అతడే ఆ ప్రేమికుడని ,

అభిమానిస్తున్నాడంటే , మనసులో

చోటును కోరుకుంటున్నవాడు అతడని .


పూలను అందిస్తే ,

పుస్తకంలో మరో పేజీ ముందుకెళ్ళిందని ,

నవ్వులు విరబూస్తే ,

ప్రేమకు అంగీకారం అలా తెలిపిందని .


మాటలు తడబడితే ,

అర్ధం చేసుకోవాల్సిన సమయమదని ,

అడుగుల్లో అడుగులు పడితే ,

రెండక్షరాల ప్రేమకు ప్రాణం ఒకటైందనీ !!



Rate this content
Log in

Similar telugu poem from Thriller