STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

4  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

ఎటో తప్పి పోయాడు

ఎటో తప్పి పోయాడు

1 min
280

ఏమైంది ఈ నగరానికి

ఒక వైపు క్షామం

మరో వైపు భయం

మనిషన్న వాడు

ఎటో తప్పిపోయాడు

పీడకలల ఉలికి పాటులో

కర్కోటక కరోనా పన్నిన

పద్మవ్యూహం లో చిక్కి

భయం గుప్పిట్లో

బెదిరి అదిరి పడుతున్నాడు

కల్లోలం రేపుతూ

కనిపించని కాలనాగై

ప్రాణాన్ని కబళిస్తుంటే

ఉలికిపాటుతో

ఎటో తప్పిపోయాడు 

సాంప్రదాయ రుచులు 

మరచిన మనిషి

ప్రకృతి ని వికృతం చేసి

చేజేతులా మృత్యుఘంటికలను

మ్రోగించి మరణశాసనాన్ని లిఖించి

మృగమై ఎటో తప్పిపోయాడు

ఇప్పటికైనా మేల్కొని

పెద్దల మాటలు విని

హద్దులు మీరక

సాంప్రదాయాలు పాటిద్దాం

కరోనాను తరిమి కొడదాం



Rate this content
Log in

Similar telugu poem from Abstract