STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఎర్రటి కళ్ళు

ఎర్రటి కళ్ళు

1 min
255

దోమలు కుట్టకుండా బిడ్డకు విసనకర్ర ఊపుతూ

రాతిరి నిద్దరను మరచిన తల్లి కళ్ళు

పిల్లల స్కూలు ఫీజుల గురించి 

పొద్దంతా పని చేసి శరీర బడలికతో మూసుకుంటున్న కళ్ళు


ప్రియురాలి సందేశం కోసం ఫోన్ చూస్తున్న కళ్ళు

భర్త రాక కోసం ఎదురు చూస్తున్న కళ్ళు

బార్ లో మద్యం రుచితో మత్తెక్కిన కళ్ళు

మొదటి రాత్రి తినేసేలా చూసే కళ్ళు


ఎక్కడ చూసినా ఎర్రటి కళ్ళు

భయంతో కోపంతో ఆవేశంతో మోహంతో

ఇలా రకరకాల భావాలు నిండిన కళ్ళు

కళ్ళు అబద్ధం చెప్పవంటారు


అదేంటో

నీ కళ్ళు కూడా భలే మోసం చేసాయ్

ఎప్పుడూ ప్రేమ నిండినట్లు 

అనురాగం వర్షించినట్లు నటించాయ్

రేపెప్పుడైనా కళ్ళు ఎర్రబడితే

నన్ను గుర్తు చేసుకో


Rate this content
Log in

Similar telugu poem from Abstract