STORYMIRROR

ARJUNAIAH NARRA

Tragedy

5.0  

ARJUNAIAH NARRA

Tragedy

ఎక్సపయిర్ డేట్ లేని కన్నీళ్ళు

ఎక్సపయిర్ డేట్ లేని కన్నీళ్ళు

1 min
413

నా ఒంటరి బతుకికి తోడుంటవనుకున్న

దుఃఖపు దారుల్లో  నన్ను ఒంటరిని చేస్తావనుకోలే

ప్రేమగా నన్ను నీ వొళ్ళోకి తీసుకుంటావనుకున్న

నీ ఒడిలో ఎందరో సేద తీరారు అని తెలియక


నీ వలపు, దుప్పటిలో నలిగిన పువ్వులాంటిదని

నీ అందం, రుచి చూడబడ్డ విందు భోజనంలాంటిదని

నీ తనువు, చీకివేసిన ఐస్క్రీమ్ పుల్లలాంటిదని

నీ బ్రతుకే, ఒక చిరిగిన విస్తరి ఆకులాంటిదని

నీ సొగసులను అవతలి వారికి ఎరవేసి ఆరబోసి 

నీ బాహువులు విరిచి, నీ రెక్కలు పరిచి 

నషాలానికి ఎక్కిన కామం మైకంలో

నన్నే మరచిపోయి శృంగారంలో 

నీ కోరికలు తీర్చుకున్నవనుకోలేదు.....


అలసిన నీ తనువు, వాడిన నీ కళ్ళు

నీ శృంగార అనుభవాన్ని గుర్తుచేస్తుంటే

నీవు ఒక అవసరమని, 

అనవసరమైన అవసరమని, 

శారీరక అవసరమని, 

ఇద్దరి మధ్య సంబంధం శృంగారం వరకు మాత్రమేనని

మన మనసుల మధ్య దూరం 

నీవు నేను ఊహించలేనంత అగాధమని

గాయపడిన నా గుండెకు 

ఒక బతుకు యదార్థం బోధపడుతుంది


నీవు, నీ ద్రోహం, నీ మోసం,  

నాకు ఒక పీడకలగా 

ఒక చేదు జ్ఞాపకంగా ఉన్న బాగుండేది

కానీ కలలు కలలుగా లేవు, 

ఆ జ్ఞాపకాలు జ్ఞాపకాలుగా లేవు

కొన్ని కలలు జ్ఞాపకాలుగా,

కొన్ని జ్ఞాపకాలు, కలలుగా ఉండి

కళ్ళను కలలు సూదుల్లా పోడుస్తున్నాయి

గుండెను జ్ఞాపకాలు శూలాలుగా గుచ్చుతున్నాయి


అందుకేనెమో నా మనసుకు జబ్బుచేసింది

వైరస్ సోకి శరీరమంతా పాకింది 

నిదురపోనీయదు, ఆకలి వేయనియ్యదు 

రాత్రంతా గుచ్చిగుచ్చి పొడిచి 

పొద్దంతా శరీరాన్ని నిస్తేజంగా పడవేస్తది

ఇదివరకు దినమంత ఉల్లాసంగా

రాత్రంతా ఉత్సహంగా ఉండేది

ఎదో తెలియని బాధ ఒక ఘడియ ఉండేదేమో

కానీ ఇపుడు దినమంత దీనంగా

రాత్రంతా శోకంగా ఉంటుంది


ఎందుకంటే.......

నన్ను నేను బహిష్కరించుకున్నాను

నాలో నుండి నేను వెళ్ళిపోయాను

గుప్పెడు గుండెలో ఆకాశమంత ఆనందం 

 కళ్లనుండి స్రవించి ప్రవహిస్తూ ఆశలను ముంచి

మమత అనురాగాల సరిహద్దులను దాటి

చివరి మజిలికి కన్నీటి మహాసంద్రంలో

నిత్యం ఎండిపోని జీవనదిలా అంతర్భాగమైంది

ఇక ఇపుడు నా కన్నీళ్లకు ఎక్సపయిరి డేట్ లేదు....



Rate this content
Log in

Similar telugu poem from Tragedy