దయలేని దేవత!
దయలేని దేవత!
ప్రియా..
లేదా..నాపై దయ!
నీ..ప్రేమతో నిండిన నా హృదయం
మల్లెపువ్వుంటి తెల్లటి కాగితం వలె..
ఉన్నది కాదా!
గబుక్కున..సిరా
ఒలికన కాగితం వలె..
జీవితం అంత..చెరగని మరకలు
చేసిపోయినవే..
ఓ దయలేని..దేవత!
మందారపు రంగు..
నీకిష్టమని!
నీవు తాకిన ప్రతి పువ్వును
నా రక్తంతో అభిషేకిస్తిని గదా!
నా రుధిర వాసనైనను
నీ శ్వాసను తాకలేదా?
కరుణ లేని.. ఓ నా..అరుణ!
ఇకనైనా..నీ మనసు మారునా!
నా చుట్టూ...
నీవు పంచిన ప్రేమ కాంతే ఉన్నా..
చుక్క వలె నాకు అందనంత దూరాన ఉన్నావు!
నీవు వస్తావేమో అనుకొని
రేయంతయు..నీలాకాశం వైపు
చూస్తూనే.. ఉన్నా!
ప్రియా..
నా కన్నీటి ధారలలో..
నీవెక్కడ కనుమరుగవుతావోనని..
బోర్లించిన మధు పాత్రవలే ఉన్న
ఆ ఆకాశం వైపే చూస్తూ ఉన్న..
ఆ అనంతమైన..మధువైనను
నా అంతులేని వ్యధను..
మత్తులో..మరణింపజేస్తుందని!
చిన్న...ఆశ!
ఓ..నా జాలి లేని చెలి!
మన ప్రేమను మరచి నన్ను విడిచి
నువ్వు వెళ్లిపోవచ్చు నేమో గానీ!
ప్రేమ మాత్రం..నన్ను ఎన్నటికీ వీడదు
ప్రేమను వదిలి నీవు..చరాస్తివి కావచ్చు
కానీ
ప్రేమను కలిగిన నేను...
ఎన్నటికీ..తరగని స్థిరాస్తినైనాను!
......రాజ్.....
