దివ్యమైన బ్రతుకు
దివ్యమైన బ్రతుకు
వృద్ధాప్యాన్ని తరిమేద్దాం!వేడుకగా వెలిగేద్దాం!
గ్రంథాలెన్నో చదివేద్దాం!కథలూ కబుర్లు చెప్పేద్దాం!
తీర్థయాత్రలు తిరిగొద్దాం!తీరిక లేదని బదులిద్దాం!
యోగా గీగా చేసేద్దాం!ఓపిక నెంతో కూడేద్దాం!
చెట్లూ చేమలు పెంచేద్దాం! జీవరక్షణ చేసేద్దాం!
వంటలు వార్పులు వద్దద్దాం! ఒంటికి విశ్రాంతి నిచ్చేద్దాం!
పిల్లగాండ్లతో పోటీపడదాం! విద్యల నెన్నో నేర్చేద్దాం!
సలహా లిచ్చుట మానేద్దాం!చక్కగ నవ్వుతూ గడిపేద్దాం!
సేవారక్తితో నిలబడదాం!చీకూ చింతలు వదిలేద్దాం!
నిరాశకు నిప్పంటిద్దాం!నెయ్యపు గాండ్లను కలిసొద్దాం!
డబ్బులు కొంచెం కూడేద్దాం!దానధర్మాలు చేసేద్దాం!
మంచిపనులకు శ్రీకారం!వంచన గించన మానేద్దాం!
దైవధ్యానమే బలమందాం!దివ్యంగా మనం బ్రతికేద్దాం!
