STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

పోటీ పోటీ

పోటీ పోటీ

1 min
0

పోటీ పోటీ 
(వచన కవిత )

**************************
పోటీ పడవోయి మానవా భూరక్షణ కోసమై 
కాటు వేయు కాలుష్యమును తొలగించుటకై

పచ్చదనమును నిలుపంగ పరుగెత్తి రావోయి!
తుచ్ఛ మైన పనులు వదలి నీవు సాగిపోవోయి!

నదులలో చెత్తను ఏరిపారేయగా వేగిరపడవోయి!
కదలవోయి బాలకా! గరళమైన జలముల కొరకై!

పక్షులను పశువులను బ్రతికించగ రావేల వీరుడా!
తక్షణమే సాయమందించగా సాంత్వన కలిగించగా!

మురికి వాడలలోని బిడ్డలకు బువ్వ పెట్ట రావోయి!
తెరువు చూపి వారికింత నీడ కల్పించగ లేవోయి!

చదువును కొనలేని పిల్లలకు చదువు చెప్పవోయి!
చెదలు పట్టిన సంఘాన్ని జాగృత పరచ రావోయి!

 జీవనము కోసము నీవు పోటీ పడుట సహజమే!
సేవ చేయుచు జాతికై పోటీ పడుట దైవత్వమే!

భరతమాత ముద్దు బిడ్డవై భవితవ్యము నిల్పవోయి!
చరితలో ఘనుడవై శాశ్వతముగా నిలిచి పోవోయి!//
*********************************


Rate this content
Log in

Similar telugu poem from Classics