STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ఘటోత్కచుడు

ఘటోత్కచుడు

1 min
0

ఘటోత్కచుడు 
(తేటగీతి మాలిక )

తల్లి దండ్రుల కీర్తిని తరతరములు 
నిల్పి నట్టి తనయుడైన నేర్పు గాడు.
మంత్ర తంత్రపు విద్యల మాయ వలన 
వైరి మూకల గూల్చు నీ వీరసుతుడు.

తండ్రి భీమసేనుని వోలె ధైర్యయుతుడు.
తల్లి యగు హిడింబకు ముద్దు తనయు డితడు.
త్యాగనిరతిని జూపించు తల్లి వెంట
నడచి సకల విద్యల నేర్చిన విబుధుండు.

భీకరంబగు నా యుద్ధ వేళ చెలగి
కౌరవాదుల సైన్యమున్ గలచి వేసి
వీర పుత్రుడై దోర్చుచు వైరి తతికి
భీతి కలిగించె నానాడు వివిధ గతుల.

శౌర్యధనుడౌ ఘటోత్కచ శక్తి గనుచు
పారి పోయిరి కౌరవ పాలకులట!
శక్తి యను నాయుధంబుతో సంగరమున
కర్ణుడా బాలకున్ గూల్చి కౌరవులను
కాచి నాడట పాండవుల్ కలత నొంద/

చిరుత వయసులో స్వర్గమున్ జేరినాడు.
వనములో వర్థిలిన శీలవతుడు ఘనుడు.
కులు మనాలి ప్రాంతంబున కొలువు దీరి
పేద సాదల కెల్లతాన్ బ్రీతి జూపి
యాది వాసీలకారాధ్యు డైనవాడు.
దీన జనబాంధవుడచట దేవుడాయె.//


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar telugu poem from Classics