STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

మంచిమాట

మంచిమాట

1 min
4

మంచి మాట
(తేటగీతి మాలిక)

**********************

మాట కత్తి విధము పరిమార్ఛ గలదు.
చింత లోన జీవితములు ఛిద్రమగును.
మాట ములుకు చందంబుగ మదిని గ్రుచ్చు.
తేనె వంటి మాటల మాయ తెలియ దకట!

గోముఖవ్యాఘ్రము లగచు కూళలెపుడు 
తీయ తీయగ విషయాలు తెలుపుచుండి 
మాయ లోబడవేయుచు మాట కలిపి
తీయు చుందురు ప్రాణముల్ తెలివి తోడ.

జాగు రూకత తోమెల్గి జనులు సతము
దుష్ట తతిని వీడిన చాలు!తొలగు బాధ!
బంధు మిత్రుల వక్రమౌ భాషణముల 
వినుట మానుము!మానవా!విబుధ గతిని 
సాధు మార్గమందున నీవు సాగిపొమ్ము!

భావమున్ వ్యక్త పరచు సంభాషణ యన
దైవ మా మాటలో నిల్చి ధరను నడుపు!
మంచి పల్కులన్ బల్కుచు మాట నిలిపి 
సత్య వంతుడవై నీవు చనుము నరుడ!

జ్ఞాన సముపార్జనన్ జేసి జయము పొందు!
పొదుపుగా మాట లాడిన పొలయు సుఖము.
మౌనమున్ శక్తిగా తల్చి మానితముగ
కలత విడనాడి విజయుడా!కదలి పొమ్ము!//


Rate this content
Log in

Similar telugu poem from Classics