నేనే నేనే...
నేనే నేనే...
నేనే నేనే...
(వచన కవిత )
నేనే ప్రధానమంత్రినయితే నీతినియమాలతో పరిపాలిస్తా!
ఈ నవభారతాన్ని ఎదురలేని విజేతగా తయారుచేస్తా!
ప్రజా సేవకుడిగా భావితరానికి మంచి భవిష్యత్తు నందిస్తా!
విజయాలనెలా అందుకోవాలో ప్రజలకు నే బోధ చేస్తుంటా!
ఒక్క పైసా జీతం లేకుండా దేశోన్నతికై నిరతం పాటుబడతా!
మొక్కవోని దీక్షతో ప్రలందరిని పుణ్యభూమికై నిలబడమంటా!
నల్లధనమును నిర్మూలించి నలువైపులా నీచుల్ని కట్టడిచేసేస్తా!
కుళ్ళిపోయిన మూఢాచారాలను సమూలంగా నాశనం చేసేస్తా!
జాతి విద్రోహులను పట్టుకొని కఠినమైన శిక్షలెన్నెన్నో వేసేస్తా!
నీతిమాలిన నాయకులను తక్షణమే ఉద్వాసన పలుకుతా!
ఘన మైన భారత సంస్కృతిని నే నెల్లవేళలా కాపాడుకుంటా!
మన దేశ వైభవాన్ని మహీతలమంతటా చాటి చెబుతుంటా!
సైనిక పాటవాన్ని పెంచుతూ మన సరిహద్దుల్ని రక్షించుకుంటా!
కనకరాశులను పండించే పల్లె రైతులకు నా కైమోడ్పు లందిస్తా!
ధనమును సృష్టించే శ్రామిక వర్గాలకు సతము సహకారమిస్తా!
అనయము మేధావులను ప్రోత్సహించి వారి నందల మెక్కిస్తా!//
