మహిళా తేజం
మహిళా తేజం
మహిళా తేజం
(వచన కవిత)
**************************
ఆకాశంలో సగం ఆడదాని హృదయ వైశాల్యం.
ప్రకాశవంతంగా మార్చు కుంటుంది తన గృహం.
సవ్వడి లేకుండా జగతిలో ఆమె చేసే కార్యాలనేకం.
కొవ్వొత్తిలాగా కరుగుతున్నా కోరదులే తన సుఖం.
తన వారి కోసం తనువు నమ్ముకోవటానికైనా సిద్ధం.
తన దేహాన్ని అగ్నిలో తోసినా మౌనంగా నిలిచే తత్వం.
ఎన్నో అరాచకాల నెదుర్కొంటూ జీవించే ధీరత్వం.
కన్నీరు నదిమి పెట్టి కాలంలో కలిసేదాకా ప్రయాణం.
మానసిక స్థైర్యంతో మానవ మృగాల మధ్య జీవనం.
ఘనమైన చరితలో తనకంటూ ఉన్నదెన్నో స్థానం?
అంతులేని ప్రేమవాహిని కామెహృదయమే జన్మస్థానం.
చింతలను దిగమింగి చిరునవ్వుతో నడయాడే స్త్రీత్వం.
దైవానికి ప్రతిరూపమై ధరలో నిలిచిన మహిళాతేజం.
జీవితానికర్థం తెలిపే స్త్రీ మూర్తులను పూజించుకొందాం!
మన ఆహాన్ని ప్రక్కన పెట్టి ఆడవారినందల మెక్కిద్దాం!
వనితా విజయానికి మనమంతా బాసటగా నిలుద్దాం!//
*************************
