మంచి నడత
మంచి నడత
మంచి నడత
(వచన కవిత )
**************************
చీరకట్టుట మాని మానినులు చిరుగు దుస్తులను ధరించితే.
తేరి చూతురు జనులు తెలియునా వెఱ్ఱి పోకడలు మించితే.
బిగుతువస్త్రంబులను కోరి నేటి వనితలు కులుకుతున్నారు.
తగని వేషాలతో కుర్రాళ్లు తైతెక్కలాడి వెంటపడుతుంటారు.
ఘనమైన భారతీయతను మరచి పోయిరి నేటి మహిళలు.
వెనుకబడిపోయిరకటా! వీధిలోన బడుచున్నవా బ్రతుకులు.
ఈనాటి చలన చిత్రాల పైత్యమవినీతికి పెద్ద పీట వేస్తుంటే.
నానాటికి నేటి యువత యాలోచనాసరళి మారిపోతుంటే.
సమాజంలో హింసా ధోరణి వేగంగా వ్యాప్తి చెందుతుంటే.
దమనకాండతో తరుణులకు రక్షణన్నది కరవవుతుంటే.
అలా చూడకండనుచు చెప్పటంలో అంతరార్థమేముంది?
ఇలా తలముపై నింతులకు భద్రతన్నది లుప్తమైపోయింది.
మన బిడ్డలే నాగరికత పేరుతో మృగాలై చరియిస్తున్నారు.
కనులు మూసుకుంటే మన జాతి యధోగతి పాలవుతుంది.
మొద్దు నిద్దురను వదలి యువతకు మంచి నడతను నేర్పండి!
బుద్దులెన్నో చెప్పండి! పట్టిన భూతాన్ని వేగంగా వదిలించండి!
ఆడపిల్లల్ని గౌరవించే సంస్కృతికి తిరిగి ప్రాణం పోయండి!
పాడుపనులను మానుకొమ్మని నేటి యువతను దండించండి!//
**************************
