భయపడకు!
భయపడకు!
వృద్దాప్యమన నీవు వేదన పడకోయి!
పద్దతిగ జీవించు బంగారు సమయమిది.
ఆట పాటలతో బాల్యమును గడిపావు!
దీటుగా చదువుకొని తెలివిగా పెరిగావు!
యవ్వనపు దశలో హాయిగా ఉన్నావు!
కవ్వించు ప్రేమలతో కలలు కన్నావు!
ఒకఇంటి వాడవై ఉద్యోగమన్నావు!
సుఖముగా సంసార చక్రమును త్రిప్పావు!
ఆలు బిడ్డల కెపుడాధారమయ్యావు!
కాలమున మంచి కార్యాలు చేశావు!
కీర్తి ప్రతిష్ఠలు పొంది గృహము నేలావు!
స్ఫూర్తిగా నలుగురికి దారి చూపావు!
నీ ధనముతో నిబ్బరంగా బ్రతుకుమా!
ఆదరించే వారికాత్మీయతను పంచుమా!
చిన్నపిల్లలతో చేరి మాటలను కలుపు!
ఎన్నెన్నో గాథలను వివరంగా తెలుపు!
భారమని భయపడకు!బాధలో మునగకు!
ధీరతను వీడకు!దిగులు నీ కెందుకు?
పెద్దవాడివి కదా! పెరుమాళ్ళుకై తపించు!
బుద్ధిమంతుడా! పుణ్యశీలివై చరించు!//
