ధ్యాన యోగం
ధ్యాన యోగం
ధ్యాన యోగం
(ఇష్టపది )
ధ్యాన యోగంబులను దైనందినవిధిగా
మానసిక శాంతికై మానిసీ! చేయుమా!
కనులు మూసుకొని సంకల్పబలమును పొంద
తనువులో రుగ్మతలు తక్షణము మాయమౌ.
మదమోహముల ద్రోలు మంచి వ్యాయామములు
ఉదయమే సల్పగా నోజస్సు వర్తిల్లు.
ఆదిత్యునికి ప్రొద్దు నర్ఘ్యంబు నిడుచుండి
మోదంబుతో గాంచ భువనాలు గెలుచుకొను
ఆయురారోగ్యముల నందించి భానుండు
శ్రేయంబు గూర్చగా జీవనము దీపించు.
జ్ఞానమును గ్రహియింప గ్రంథములు చదువుకో!
దీనత్వమును వీడి ధీరునిగ మసలుకో!
పరమాత్మ కోసమై ప్రకృతిలో శోధించు!
నిరతమా తపనతో నిష్ఠగా జీవించు!
కర్మ సంచితములను కాల్చగా యత్నించు!
ధర్మమార్గము లో నీవు ధైర్యముగ పయనించు!//
