దైవం మానుష రూపేణ
దైవం మానుష రూపేణ
తెల్ల కోటు వేసుకుని,
స్టెతస్కోప్ పట్టుకుని,
రకరకాల వ్యాధులతో,
చెప్పుకోలేని సమస్యలతో,
వచ్చే వివిధ రకాల రోగులతో మాట్లాడి,
వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరింప ప్రయత్నించే,
ప్రతి నిస్వార్థ వైద్యుని చూసినప్పుడు,
అనుకుంటాను దైవం మానుష రూపేణ అని,
ప్రణమిల్లుతాను మనసులో డాక్టరే దేవుడని.