చూపు నిలుపు
చూపు నిలుపు
చూపునిలుపు మంత్రమేదొ..వేసినావు కాద..!
కలల పంజరమున పట్టి..ఉంచినావు కాద..!
నిశ్చయముగ ఇది ప్రేమయె..సందేహము లేదు..
ఈ మనసను మోహవీణ..మీటినావు కాద..!
రాగాలకు పల్లకిలా..మిగిలిపోయె వలపు..
భావాలను స్వరధారగ..మలచినావు కాద..!
గుండెలయల సవ్వడిలో..మెఱుపువీణ మ్రోగె..
మౌనమేఘ మాలికవై..నవ్వినావు కాద..!
పలుకుతేనె మధురిమకే..అద్దమల్లె నీవు..
పరిమళించు అనురాగం..కురిసినావు కాద..!

