STORYMIRROR

Praveena Monangi

Tragedy

4  

Praveena Monangi

Tragedy

చరవాణి

చరవాణి

1 min
293

ఎటు చూసినా అందరి హస్తములలో

అలంకార వస్తువుగా చరవాణి దర్శనం

ఇంటిలో ఉండేది నలుగురు 

నాలుగు చరవాణుల దర్శనం

ఒక ఇంటికి పోతే చరవాణిలో పాటలు వింటూ

పనిచేసే అమ్మి దర్శనం

కూరగాయలకు వెళితే చరవాణిలో 

మాట్లాడుతూ కూరగాయలు అమ్మే అబ్బి దర్శనం

గుడికి వెళితే చరవాణిలో వాట్సప్ప్ చూస్తూ 

శఠగోపం పెట్టే పూజారి దర్శనం

రోడ్డు పైకి పోతే చరవాణిలో పాటలు వింటూ

రోడ్డు దాటే యువకుల దర్శనం

ఒక చేతితో బండి నడుపుతూ తలవంకరగా చెవికి

చరవాణి ని ఆనించి మాట్లాడుతూ హంగామా చేసే కుర్రాళ్ళ దర్శనం

ఆఫీసుకు వెళితే ఒక ప్రక్క చరవాణి లో భాషణ చేస్తూ

మరో వైపు శుభోదయం తెలిపే సహ ఉధ్యోగి దర్శనం

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద చరవాణిలో మాట్లాడుతూ 

బిచ్చగాడి దర్శనం

మిఠాయి దుకాణానికి వెళితే నా రాకని గమనించక

చరవాణి లో మాట్లాడుతూ యజమాని దర్శనం

చివరకు ఇంటికి వెళితే శిరస్సు పక్కకి త్రిప్పకుండా

ఒక తపస్సు లా చరవాణి లో ఆటలు ఆడుతూ

దర్శనమిచ్చిన నా పిల్లలే నేటి చరవాణి 

దుస్థితికి నిదర్శనం.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy