చివరి మజిలీ
చివరి మజిలీ
పట్ట పగలు కట్టెలు కాలుతున్నవి
కాలే కట్టెల్లో కాయం కాలుతున్నది
కాలుతున్న కాయం నుంచి కమురు వాసన వస్తున్నది
కమురు వాసన ముక్కు పుటలను తాకుతున్నది
కాయం కాలి మాడి మసై పొగలు మబ్బులను తాకుతున్నవి
నీ కోసం ఎదురు చూసే కళ్ళు వెళ్లిపోయాయి
నీ రాక కోసం చూసే నీ పిల్లలు మళ్ళిపోయారు
నీ బందుగణం నీకు బహుదూరంగా వెళ్లారు
మహాప్రస్థానంతో మనిషి చేరే చివరి మజిలే
రుద్ర క్షేత్రం......అదే కబరస్థాన్
అందరి ఆనవాళ్లు మాయం చేస్తున్నది
మనిషి ఉనికిని క్షణంలో శూన్యం గావిస్తున్నది
నీ గర్వం గాలిలో కలిసింది
ఆకాశాన్ని తాకిన నీ ఆశ
చివరికి బుడిదగా మారింది
ఆప్యాతలు, అనుబంధాలు, ఆనురాగలు
ఆహుతి జ్వాలల్లో ఊపిరి తీసుకున్నవి
ఇప్పుడు ఈ శ్మశానం నిశ్శబ్దంగా ఉన్నది......
ఆ నిశ్శబ్దంలో ప్రశాంతత.......
ఓ అవిశ్రాంత మనిషికి, విశ్రాంతి దొరికింది.
(బస్ లో వెళుతున్నప్పుడు, నేను చూసిన దృశ్యం, తగలబడుతున్న శవం...)
