చిన్నప్పటి ఈరసం
చిన్నప్పటి ఈరసం


మనసులో వచ్చెను ఎన్నో ఆలోచనలు,
ఈ మనసులో దాగి ఉండెను ఎన్నో భావాలు |౧|
ఉండవు చిన్నతనం లో ఎక్కువ ఆశలు ఆశయాలు,
ఎంతో చిత్రం విచిత్రంగా ఉండెను చిన్నప్పటి విషయాలు |౨|
ఒకరి అందమైన వదనం చుస్తే కలిగెను అసూయ,
అనిపించెను నాకెందుకు లేదు ఇలాంటి ఛాయ |త్రీ|
ఎప్పుడైనా చూస్తే ఒకరి వద్ద కొత్త కథల పుస్తకం,
మనసులో ఈరస కలిగి తీసుకోవాలనిపించెను ఆ పుస్తకం |౪|
సహపాఠి అందమైన బడి సంచి కలిగించెను అసూయ,
ఇది చిన్నతనంలో తెలిసీతెలియని భావోద్వేగాల ప్రక్రియ |౫|
పెద్దయిసరికి అనిపించెను ఈ అసూయా నిరర్థకం,
ఇది కేవలం ఒక నవ్వుకునే చిన్ననాటి నాటకం |౬|
గడిపిచిపోయెను చాలాచాలా సంవత్సరాలు,
మనసులో సరదాగా నిలిచిపోయెను ఈ చిన్నప్పటి ఈరసం జ్ఞాపకాలు |౭|