STORYMIRROR

sesi saradi

Abstract Drama Children

4  

sesi saradi

Abstract Drama Children

చిన్ననాటి జ్ఞాపకాలు

చిన్ననాటి జ్ఞాపకాలు

2 mins
380

చిన్ననాటి జ్ఞాపకాలు ,

 మాధుర్యపు గుళికలు

 ఎప్పటికీ తిరిగిరాని 

అపురూప చిత్రాలు.


ఇంట్లో గారాబాలు

స్కూల్ లో పాఠాలు

 స్నేహితులతో ఆటలు

 బండి దగ్గర చిరు తిళ్ళు.


చిన్ననాటి జ్ఞాపకాలు ,

 మాధుర్యపు గుళికలు.


ఆటలలో గొడవలు

 ఓడితే అలకలు,

ఎడ ముఖాలు పెడ ముఖాలు,

 అంతలోనే చెట్టా పట్టాలు


చిన్ననాటి జ్ఞాపకాలు ,

 మాధుర్యపు గుళికలు.


.పరీక్షలలో రాత్రంతా చదువులు

 సెలవులలో పగలంతా కబుర్లు

 ఎంతకీ తరగవా అని

 అమ్మ కేకలు.


చిన్ననాటి జ్ఞాపకాలు ,

 మాధుర్యపు గుళికలు.


హిందూ పేపర్ చదివించి,

 ఆంగ్ల పరిజ్ఞానం పెంచిన నాన్నగారు.

 లైబ్రరీ కి తీసికెళ్ళి, పఠనాభిలాష

 కలిగించిన మాస్టారు.


చిన్ననాటి జ్ఞాపకాలు ,

 మాధుర్యపు గుళికలు.


ఇప్పుడు కృతజ్ఞతలు

 తెలుపుదామన్నా

 తిరిగిరాని లోకాలకు

 వెళ్ళిన పెద్దలు .


చిన్ననాటి జ్ఞాపకాలు ,

 మాధుర్యపు గుళికలు.


తలచుకుంటే మనసంతా

 ఆవరించే తియ్యని భావన.

తిరిగి రాదని తెలిసినా

 రావాలనే కోరిక.


చిన్ననాటి జ్ఞాపకాలు ,

 మాధుర్యపు గుళికలు

 ఎప్పటికీ తిరిగిరాని 

అపురూప చిత్రాలు.







Rate this content
Log in

Similar telugu poem from Abstract