STORYMIRROR

sesi saradi

Drama

4  

sesi saradi

Drama

ఆడ'పిల్ల నమ్మా నేను

ఆడ'పిల్ల నమ్మా నేను

1 min
368

 'ఆడ'పిల్ల నమ్మా నేను ఆడపిల్లను!

'ఆడ'పిల్లనే కానీ

'ఈడ' పిల్లను కానమ్మా !

అమ్మను చూడాలంటే ఆంక్షలు ,

పుట్టింటికి వెళ్లాలంటే పర్మిషన్లు, అవసరమయ్యే ,

ఆడ'పిల్ల నమ్మా నేను "ఆడ"పిల్లను!

పెళ్ళైన తర్వాత ఇల్లు

ఇంటి పేరు కూడా

మారతాయి కదా అందుకే ,

ఆడ'పిల్ల నమ్మా నేను "ఆడ"పిల్లను!

ఇంకొక ఇంటికి ఇల్లాలిని

అయినప్పుడే కొత్త బాధ్యతలు

వచ్చాయి కదా! అందుకే ,

ఆడ'పిల్ల నమ్మా నేను 'ఆడ'పిల్లను!

అత్తమ్మ లోనే అమ్మను

చూసుకునే సంస్కారం

నేర్పావు కదా అందుకే

ఆడ'పిల్ల నమ్మా నేను ఆడపిల్లను!

అనుమతి లేనిదే

నీ దగ్గరకు రాలేని

నిస్సహాయురాలిని అందుకే,

ఆడపిల్ల నమ్మా నేను 'ఆడ'పిల్లను!

కూతురు కొక న్యాయం

కోడలి కొక న్యాయం ఉన్న

సమాజంలో ఉన్నాను అందుకే ,

ఆడపిల్ల నమ్మా నేను 'ఆడ'పిల్లను!

'ఆడ'పిల్లనే కానీ

"ఈడ" పిల్లను కానమ్మా !


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Drama